IPL 2025 : RCB vs CSK ఐపీఎల్ మ్యాచ్... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(RCB vs CSK) మధ్య మ్యాచ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(RCB vs CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం(Chennai Chepak Stadium) వేదికగా కాసేపట్లో మొదలవనున్న ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగనుంది. కోల్ కతా మీద గెలిచి ఆర్సీబీ, ముంబై మీద గెలిచి చెన్నై జోరు మీద ఉన్నాయి. ఇక చెన్నై జట్టులో కీలక బౌలర్ పతినర గాయం కారణంగా ఈ మ్యాచ్ కు కూడా దూరంగా ఉన్నాడు. ఆర్సీబీ vs చెన్నై మధ్య జరగనున్న ఈ మ్యాచ్ పై ఇరు జట్లపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారో అని సోషల్ మీడియా వేదికగా ఓటింగ్ కూడా జరుగుతోంది.
ఇరు జట్ల వివరాలు :
CSK: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కరన్, MS ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.
RCB: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసీఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.