ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బోణీ.. కేకేఆర్‌పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో ముంబై ఇండియన్స్ భోణి కొట్టింది. సోమవారం ముంబైలోని వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. సోమవారం ముంబైలోని వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. కేకేఆర్(KKR) నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(62), సూర్య కుమార్ యాదవ్(27), విల్ జాక్స్(26), రోహిత్ శర్మ(13)తో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రె రస్సెల్ తలో వికెట్ తీశారు.
ఇక టాస్ ఓడి కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు క్వింటాన్ డికాక్(1), సునీల్ నరైన్(0) నిరాశ పర్చగా.. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే(11), వెంకటేశ్ అయ్యర్(3), రింకూ సింగ్(17), మనీశ్ పాండే(19), రస్సెల్(05) కూడా విఫలం అయ్యారు. రఘువంశీ(26), రమన్ దీప్ సింగ్(22) పర్వాలేదు అనిపించి జట్టు ఆ మాత్రం స్కోర్ వచ్చేలా ప్రయత్నించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేశ్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.