రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. రెండో భారత క్రికెటర్‌గా..

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Update: 2023-03-01 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ట్రెవిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా జడేజా ఖాతాలో 500 వ అంతర్జాతీయ వికెట్ (టెస్ట్, వన్డే, టీ20) చేరింది. దీంతో బ్యాటుతో 5 వేల పరుగులు, బంతితో 500 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అయితే భారత్ నుంచి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. భారతదేశం తరఫున తన 63వ టెస్టు ఆడుతున్న జడేజా.. తన మొదటి ఓవర్‌ నాలుగో బంతికి ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేశాడు.

టెస్టులలో 260, వన్డేలలో 189, టీ20లలో 51 వికెట్లను పడగొట్టాడు. దీంతో 5,000 పరుగులు మరియు 500 వికెట్లు జడేజా ఖాతాలో చేరాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు, 500 వికెట్లు తీసిన 11వ ప్లేయర్‌గా జడేజా నిలిచాడు. ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, కపిల్ దేవ్‌, షాన్ పోలాక్, చమిందా వాస్, జాక్వస్ కలీస్, డానియల్ విటోరి, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ ఈ ఫీట్ సాధించారు. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్‌, నాథన్‌ లియోన్‌ ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు.

Tags:    

Similar News