చెలరేగడమే మా స్టైల్.. మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై రోహిత్ శర్మ కౌంటర్
తొలి రెండు టెస్ట్‌లు గెలవడంతో భారత ఆటగాళ్లకు విజయ గర్వం తలకెక్కిందని, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నారని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తొలి రెండు టెస్ట్‌లు గెలవడంతో భారత ఆటగాళ్లకు విజయ గర్వం తలకెక్కిందని, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నారని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి ప్రస్తావించగా.. ఘాటుగా బదులిచ్చాడు. 'తొలి రెండు టెస్ట్ గెలిచిన తర్వాత కూడా ఆటగాళ్లు అతి విశ్వాసంతో ఉన్నారనే చర్చ చెత్త వాగుడే అవుతుందన్నారు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ఆటగాళ్ల ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఇదంతా చెత్త వాగుడని మండిపడ్డాడు. తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు. కనికరం లేకుండా ప్రత్యర్థిపై చెలరేగడమే తమ ఆటగాళ్ల ఉద్దేశమని.. అది వారికి అతి విశ్వాసం లా కనిపిస్తే తాము ఏం చేయలేమన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో మాత్రం విఫలమైంది. టర్నింగ్ ట్రాక్‌పై భారత బ్యాటర్లు చెతులెత్తేయడంతో ఓటమికి తల వంచింది. ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దనే ఆలోచనతో ఆడుతారు. మేం కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాం. ఇది బయటి వారికి అతి విశ్వాసం లా కనిపిస్తే మేం చేయలేం. ఆఖరి టెస్ట్‌కు ఇరు దేశాల ప్రధానులు వస్తున్నారు. వారి సమక్షంలో మ్యాచ్ ఆడాల్సి రావడం చాలా ఉత్సాహంగా ఉంది. గత మ్యాచ్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడంతోనే విజయం సాధించలేకపోయాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తాను అని రోహిత్ చెప్పుకొచ్చారు.