ఆంధ్ర జట్టు 172 ఆలౌట్

రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాటర్లు శనివారం దారుణంగా విఫలమయ్యారు.

Update: 2024-02-24 15:32 GMT

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాటర్లు శనివారం దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 234/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు తొలి బంతికే చివరి వికెట్ కోల్పోయి ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆంధ్ర బ్యాటర్లు తడబడ్డారు. కరణ్ షిండే చేసిన 38 పరుగులే టాప్ స్కోర్. కెప్టెన్ రిక్కీ భుయ్ 32 పరుగులు చేసి అవుటయ్యాడు. టాపార్డర్ విఫలమవడంతో 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. కార్తీకేయ(3/41), అనుభవ్(3/33) సత్తాచాటగా.. అవేశ్ ఖాన్, కల్వంత్ ఖేజ్రోలియా తలా రెండు వికెట్లు పడగొట్టారు. చివరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. యశ్ దూబె(6 బ్యాటింగ్), హిమాన్షు(15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ 83 పరుగులు ఆధిక్యంలో ఉన్నది. 

Tags:    

Similar News