బెంగళూరు ఓపెన్‌లో క్వార్టర్స్‌కు రామనాథన్

బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

Update: 2024-02-14 17:56 GMT

దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామనాథన్ 1-6, 6-4, 6-4 తేడాతో టాప్ సీడ్, ఇటలీ ప్లేయర్ లూకా నార్డీని మట్టికరిపించాడు. గంటా 33 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ముందుగా రామనాథన్‌కు శుభారంభం దక్కలేదు. తొలి సెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత బలంగా పుంజుకున్న అతను వరుసగా రెండు సెట్లలో టాప్ సీడ్‌పై నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కొరియా ఆటగాడు హాంగ్ సియోంగ్ చాన్‌తో రామనాథన్ తలపడనున్నాడు. అలాగే, పురుషుల డబుల్స్‌లోనూ రామనాథన్ సహచర ఆటగాడు సాకేత్ మైనేనితో కలిసి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. తొలి రౌండ్‌లో రామనాథన్-సాకేత్ జోడీ 6-0, 7-6(7-2) తేడాతో మరో భారత జంట సిద్ధాంత్-ప్రజ్వల్ దేవ్‌పై విజయం సాధించింది. నేడుక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జాకబ్-మార్క్ వాల్నర్(జర్మనీ) జోడీతో రామనాథన్ ద్వయం తలపడనుంది. 

Tags:    

Similar News