Asia Cup 2023: భారత్, నేపాల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. పసికూన ముందు తేలిపోయిన భారత బౌలింగ్..

Update: 2023-09-04 13:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023 టోర్నీని వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్ మ్యాచ్‌ని కూడా వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది నేపాల్ జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన నేపాల్‌కి భారత ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ బాగా కలిసి వచ్చింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 క్యాచులను డ్రాప్ చేశారు.

దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 144 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది నేపాల్. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి దీపేంద్ర సింగ్ ఆరీ 20 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు, సోమ్‌పాల్ కమీ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ఏడో వికెట్‌కి 36 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత బౌలర్‌లో.. జడేజా 3, సిరాజ్ 2, శార్దుల్ 1 వికెట్ తీశారు.


Similar News