క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆటగాడు!
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ స్పిన్నర్ రాహుల్ శర్మ అన్ని రకాల ఫార్మాట్లకు - Rahul Sharma announces retirement from all forms of cricket
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ స్పిన్నర్ రాహుల్ శర్మ అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రాహుల్ శర్మ తన ట్విటర్ వేదికగా ఆదివారం ప్రకటించాడు. "నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, బీసీసీఐకు ధన్యవాదాలు" అని రాహుల్ ట్విట్ చేశాడు. అయితే బెల్ పాల్సి(ముఖ పక్షవాతం) సమస్యతో బాధపడ్డ రాహుల్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. రాహుల్ శర్మ 2011లో భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శర్మ 4 వన్డేలు, 2 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. శర్మ 2010లో డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో శర్మ మొత్తం 44 మ్యాచ్‌లల్లో.. 40 వికెట్లు పడగొట్టాడు.
Thanks to all for ur love and support throughout my journey 😊❤️🇮🇳 @BCCI @BCCIdomestic @IPL #retirement pic.twitter.com/anqBGUSwoa
— Rahul Sharma (@ImRahulSharma3) August 28, 2022