వరల్డ్ కప్ వేళ అశ్విన్‌పై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

స్వదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ఎంతో దూరంలో లేదు.

Update: 2023-09-22 14:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్వదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ఎంతో దూరంలో లేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ టీమిండియాకు ముమ్మాటికీ లాభం చేకూర్చే అంశం. ఈ క్రమంలో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు గాను ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. అయితే, ఆసియా కప్‌లో ఇటీవల గాయపడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్ కోలుకోలేని పక్షంలో అశ్విన్ ప్రపంచకప్‌కు ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ఈ అంశంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఇది అశ్విన్‌కు పరీక్ష కాదని, అతడు గొప్ప అనుభవం ఉన్న ఆటగాడు. బౌలింగ్ కీలక వికెట్లు తీస్తూ.. నెం.8లో సమర్ధవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఏడాదిగా అతను వన్డే ఆడలేదు.. అతడి అనుభవంతో రాణించగలడు' అని ద్రావిడ్ అన్నాడు.

Tags:    

Similar News