Dravid: ఆర్ఆర్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది

Update: 2024-09-04 15:23 GMT

దిశ, స్పోర్ట్స్: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఖాళీగా ఉన్న రాహుల్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం అయినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో కథనం పేర్కొంది. 2025 మెగా వేలంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై కూడా ద్రవిడ్ రాజస్థాన్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక మొన్నటివరకు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విక్రమ్ రాథోడ్‌ను ఆర్ ఆర్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్ అయిన తరుణంలో ద్రవిడ్ కేకేఆర్ మెంటార్‌గా వెళ్తారనే ప్రచారం జరిగింది.

కానీ, అనూహ్యంగా రాజస్థాన్ ఫ్రాంచైజీతో రాహుల్ ద్రవిడ్ కలిసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆర్ఆర్ ఫ్రాంచైజీతో రాహుల్‌కు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్, మెంటార్‌గా కూడా ద్రవిడ్ గతంలో పనిచేశాడు. ప్రస్తుతం రాహుల్ ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే 2021 నుంచి రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న కుమార సంగక్కరను ఇతర లీగుల్లో ( SA20,cpl)లో అదే బాధ్యతల్లో కొనసాగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


Similar News