Rafael Nadal : డెవిస్ కప్‌లో ఓటమి.. ముగిసిన రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ కెరీర్
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది.
దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్‌లో నెదర్లాండ్ చేతిలో స్పెయిన్ ఓటమి చవిచూసింది. స్పెయిన్‌లోని మలగాలో జరిగిన చివరి మ్యాచ్‌లో నాదల్ వరుస సెట్‌లలో 4-6, 4-6 తేడాతో నెదర్లాండ్ ఆటగాడు వాన్ డి జాండ్స్‌చల్ప్ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్‌లు, 4 డెవిస్ కప్‌లు, రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్‌ను గెలుచుకున్నాడు.
టెన్నిస్ స్టార్ ఎమోషనల్..
సొంత గడ్డ మీద జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమితో టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ కెరీర్ ముగిసింది. మార్టిన్ కర్పెనా అరెనాలో చివరి మ్యాచ్‌ను 10 వేల మంది వీక్షించగా వారిని ఉద్దేశించి నాదల్ మాట్లాడారు. ‘పీస్ఆఫ్ మైండ్’తో ఆట నుంచి నిష్ర్కమిస్తున్నా.. చివరి సారిగా జాతీయ గీతాలాపన చేయడం స్పెషల్‌గా అనిపిస్తోంది. కెరీర్‌లో ఎన్నో టైటిల్స్ సాధించా. చిన్న గ్రామం నుంచి వచ్చిన నన్ను మంచి వ్యక్తిగా గుర్తిస్తేనే చాలా సంతోషిస్తా.. కన్న కలల కన్నా ఎక్కువగానే సాధించాను. చిన్ననాటి నుంచి కోచ్‌గా వ్యవహరించిన నా అంకుల్(టోనీ నాదల్), నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుల మద్దతును ఎన్నటికీ మర్చిపోలేను.’ అని నాదల్ అన్నాడు. అనంతరం ఉబికి వస్తున్న కన్నీళ్లతో నాదల్ టెన్నిస్ కోర్టును వీడాడు.