టెన్త్ బోర్డు ఎగ్జామ్‌లో వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచ్‌పై ప్రశ్న! నెటిజన్లు షాక్?
సాధారంణంగా టెన్త్ బోర్డు పరీక్షల్లో సబ్జెక్ట్‌కు సంబంధిచిన ప్రశ్నలు ఇస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ గురించి ఓ ప్రశ్న వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సాధారంణంగా టెన్త్ బోర్డు పరీక్షల్లో సబ్జెక్ట్‌కు సంబంధిచిన ప్రశ్నలు ఇస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ గురించి ఓ ప్రశ్న వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా గుజరాత్ టెన్త్ బోర్డు పరీక్షల్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి ఓ ప్రశ్న అడిగారు. అయితే అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ - 2023 ఫైనల్ మ్యాచ్ చూశారా? మీ దృష్టిని బట్టి ఆ మ్యాచ్ గురించి ఓ రిపోర్ట్ రాయండి అంటూ ప్రశ్నను అడిగారు. క్వశ్చన్ పేపర్‌లో 55వ బిట్‌గా 4 మార్కుల కోసం ఈ స్పోర్ట్స్ ప్రశ్న వచ్చింది. దీంతో ఈ ప్రశ్నను చూసి విద్యార్థు షాక్ అయినట్లు సమాచారం. క్రికెట్ పై అవగాహన ఉన్నవారు మాత్రం సునాయాసంగా రాసినట్లు తెలిసింది.
అయితే ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 వరల్డ్ కప్‌లో భారత్ అన్నీ మ్యాచుల్లో గెలిచి.. ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ -2023 ట్రోఫీని ఆస్ట్రేలియా ఎగరేసుకపోయింది. క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేరు. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. టెన్త్ స్కూల్ పిల్లలు కూడా బాదపడుతూ ఈ ప్రశ్నకు సమాధానం రాసి ఉంటారని, ఎన్నో ఆశలు పెట్టుకోని చివరికి ఓడిపోయిన మ్యాచ్‌ను ఎందుకు గుర్తుచేస్తున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.