టీమిండియాకు ఢిల్లీలో.. తప్పని తిప్పలు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఢిల్లీ వచ్చిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుందిః. సాధారణంగా ఇలా ఒక నగరంలో మ్యాచ్ ఉంటే అక్కడి ప్రముఖ హోటల్‌లో టీమిండియా బృందం బస చేస్తుంది.

Update: 2023-02-17 05:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఢిల్లీ వచ్చిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుందిః. సాధారణంగా ఇలా ఒక నగరంలో మ్యాచ్ ఉంటే అక్కడి ప్రముఖ హోటల్‌లో టీమిండియా బృందం బస చేస్తుంది. కానీ దేశరాజధాని ఢిల్లీలో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి జీ20 సమ్మిట్ జరగనుంది. అదేవిధంగా పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ఢిల్లీలోని బడా హోటళ్లు అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో నిండిపోయాయట. దీంతో ముందుగా తాము దిగిన హోటల్‌ను టీమిండియా ఖాళీ చేయాల్సి వచ్చిందట. అక్కడి నుంచి వేరే హోటల్‌కు వెళ్లిందని సమాచారం.

ఢిల్లీలో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా సరే టీమిండియా బృందం అంతా కూడా ఇక్కడి తాజ్ ప్యాలెస్ లేదా ఐటీసీ మౌర్య హోటళ్లలోనే బస చేస్తుండేది. కానీ ఈసారి ఆ రెండు హోటల్స్‌లో ఖాళీ లేకపోవడంతో కర్కార్‌దుమాలోని 'హోటల్ లీలా'లో బస చేసిందని సమాచారం. ఢిల్లీలో ఎప్పుడూ దిగే హోటల్ కాకుండా.. వేరే ప్రాంతంలో ఉండే హోటల్‌లో టీమిండియా ఉండాల్సి వచ్చింది. పెళ్లిళ్ల సీజన్, జీ20 సదస్సుల కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడంతో ఐటీసీ మౌర్య, తాజ్ హోటల్‌లో ఉండటం కుదరలేదని బీసీసీఐకి చెందిన వర్గాలు తెలిపాయి.

అయితే భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం జట్టుతో కలిసి ఉండటం లేదట. కోహ్లీ కుటుంబం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటుంది. దీంతో అతను కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడని తెలుస్తోంది. ఢిల్లీ వరకు వచ్చాడు కదా.. అందుకే ఈ సమయాన్ని గురుగ్రామ్‌లో కుటుంబ సభ్యులతో గడపాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడట. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా డిసెంబర్ 2017 తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఇదే. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News