ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో కాంస్యం.. అభినందనలు చెప్పిన ప్రధాని మోడీ

పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్ జట్టుపై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది.

Update: 2024-08-08 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్ జట్టుపై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. స్పెయిన్‌పై 2-1 తేడాతో నెగ్గి టీమిండియా సత్తా సాధించింది. తాజాగా హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. ‘ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత హాకీ వరుసగా రెండో పతకం సాధించింది. హాకీ జట్టు ప్లేయర్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. వీరి ప్రదర్శన అద్భుతం’ అని ప్రధాని కొనియాడారు. మొత్తం ఈ ఒలంపిక్ మెగా టోర్నమెంట్‌లో భారత్ మొత్తం నాలుగు పతకాలు సాధించింది. కాగా, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్యం సాధించింది. అంతకుముందు 1968, 1972లో భారత హాకీ జట్టు పతకాలు సాధించడం విశేషం.

Tags:    

Similar News