PKL 2024 Auction : ముగిసిన పీకేఎల్ వేలం.. అన్‌సోల్డ్‌గా రాహుల్ చౌదరి

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌కు సంబంధించిన వేలం ముగిసింది.

Update: 2024-08-16 19:22 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌కు సంబంధించిన వేలం ముగిసింది. ముంబైలో గురువారం, శుక్రవారం ఆక్షన్ జరిగింది. రెండురోజులపాటు జరిగిన వేలంలో 500కుపైగా మంది ప్లేయర్లు పాల్గొనగా.. మొత్తం 118 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. తొలి రోజు 20 మంది, రెండో రోజు ఏకంగా 99 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. రికార్డు స్థాయిలో 8 మంది రూ.కోటికిపైగా ధర పలికారు. రైడర్ సచిన్‌ రూ. 2.15 కోట్లతో ఈ వేలంలో ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా నిలిచాడు. అతన్ని తమిళ్ తలైవాస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

రెండో రోజు ఏ ఆటగాడికి రూ. కోటి ధర పలకలేదు. అత్యధికంగా రైడర్ అజిత్ కుమార్‌ను రూ.66 లక్షలకు పుణేరి పల్టాన్ దక్కించుకుంది. ఆ తర్వాత జై భగవాన్‌ కోసం బెంగళూ బుల్స్ రూ. 63 లక్షలు కుమ్మరించింది. 9వ సీజన్ విన్నర్ రాహుల్ చౌదరి అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం. గత నాలుగు సీజన్లగా ఆకట్టుకోలేకపోయిన అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపించలేదు. అలాగే, సౌత్ కొరియా రైడర్ జాంగ్ కున్ లీ నాలుగు సీజన్ల తర్వాత పీకేఎల్‌లో కనిపించబోతున్నాడు. అతన్ని పాట్నా పైరేట్స్ రూ. 17.50 లక్షలకు తీసుకుంది. 

Tags:    

Similar News