Paris Olympics: విజేతలకు మెడల్స్‌తో పాటు అదనంగా ఇస్తోన్న బాక్స్‌లో ఏముంది? సందేహాలు వ్యక్తం చేస్తోన్న జనాలకు క్లారిటీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు సార్లు ఘన విజయం సాధించింది.
దిశ, ఫీచర్స్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు సార్లు ఘన విజయం సాధించింది. ఏకంగా రెండు సార్లు పథకాలు దక్కించుకుంది. బుధవారం జరిగిన పురుషుల రెఫిల్ 50మీటర్ల 3పి ఈవెంట్‌లో స్వప్నిల్ కుసలే తన 60 షాట్లలో 590 పాయింట్లతో 38 ఇన్నర్ 10 లతో ముగించారు. దీంతో 7 వస్థానంలో నిలిచి ఇండియా ఫైనల్ కు చేరుకుంది. తర్వాత రోజు మ్యాచ్ లో స్వప్నిల్ కుసాలే 3 వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో కాంస్య పతకాన్ని అందుకుంది.ఈ పతకాలతో పాటు మను బాకర్ అండ్ సరబ్ జోత్ సింగ్ ఓ పొడవాటి బాక్స్ కూడా తీసుకున్నారు.
అయితే ఆ బాక్సులో ఏముందని ప్రస్తుతం నెటిజన్లకు పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే అందులో జనాలు ఊహించినట్లుగా ఖరీదైన బహుమతి ఏం లేదు. పారిస్ ఒలింపిక్స్ అఫిషీయల్ పోస్టర్ ఒకటి ఉందట. ఈ పోస్టర్‌ను ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్ డైరెక్టర్ ఉగో గటోనీ తయారు చేశారు. కానీ నెటిజన్లు 40 సెంటిమీటర్ల కార్డ్ బోర్డ్ బాక్సులో కాస్ట్లీ బహుమతి ఏదైనా ఉంటుందని అనుకున్నారు. కానీ పోస్టర్ మాత్రమే ఉందని క్లారిటీ వచ్చింది. ఇక భారత ప్లేయర్లు అందుకునే గోల్డ్ మెడల్ తయారీ ధర భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు. ఉంటుందట. రజతం విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుందట.