ఒలంపిక్స్ ముగిసేలోపు తీర్పు చెబుతాం.. వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై పారిస్ కోర్టు ప్రకటన
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై శుక్రవారం పారిస్ కోర్టు కీలక ప్రకటన చేసింది. అత్యవసరంగా తీర్పు వెల్లడించాలని వినేశ్ ఫొగట్ తమను కోరలేదని అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై శుక్రవారం పారిస్ కోర్టు కీలక ప్రకటన చేసింది. అత్యవసరంగా తీర్పు వెల్లడించాలని వినేశ్ ఫొగట్ తమను కోరలేదని అన్నారు. కేవలం సిల్వర్ మెడల్ షేర్ చేయాలని రిక్వెస్ట్ చేసిందని గుర్తుచేశారు. ఈరోజు ఇరుపక్షాల వాదనలు వింటామని హామీ ఇచ్చారు. ఒలంపిక్ క్రీడలు ముగిసే లోపు తమ నిర్ణయం, తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. కాగా, 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు ఉండటంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. వినేశ్‌కు దేశ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు అండగా నిలిచారు. ప్రధాని మోడీ స్పందించి ‘చాంపియన్లకే చాంపియన్. మీ పోరాట పటిమ అందరికీ ఆదర్శం’ అని ఫొగట్‌కు భరోసా ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది స్పందించి అసాధారణ ప్రతిభ కనబరిచారు. తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారు అని రాష్ట్రపతి సందేశం పంపించారు.