పాకిస్తాన్ బ్యాటర్ చెత్త రికార్డు
టీ20 సీరీస్‌లలో పూర్తి సభ్య దేశానికి చెందిన ప్లేయర్ మూడు డకౌట్లు సాధించడం ఇదే తొలి సారి. మొత్తం మీద 12 మంది బ్యాటర్లు ఒక సిరీస్‌లో డకౌట్లు సాధించారు.

- ఒకే సిరీస్‌లో మూడు డకౌట్లు
- న్యూజీలాండ్ సిరీస్‌లో హసన్ నవాజ్ రికార్డు
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు మూడో టీ20 తప్ప మిగిలినవి అన్నీ ఓడిపోయి 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. అయితే బుధవారం వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ హసన్ నవాజ్ చెత్త రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు డకౌట్లు అయిన బ్యాటర్‌గా నవాజ్ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో నవాజ్ ఒక సెంచరీ చేయడం కూడా గమనార్హం. ఆక్లాండ్‌లో జరిగిన మూడో టీ20లో నవాజ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో పాకిస్తాన్ సాధించిన ఏకైన విజయం ఇదే.
టీ20 సీరీస్‌లలో పూర్తి సభ్య దేశానికి చెందిన ప్లేయర్ మూడు డకౌట్లు సాధించడం ఇదే తొలి సారి. మొత్తం మీద 12 మంది బ్యాటర్లు ఒక సిరీస్‌లో డకౌట్లు సాధించారు. ఆండ్రూ మన్సాలే (వనాటు), మోజామ్ అలీ బేగ్ (మలావి), అరవింద్ లైజీ కెరాయ్ (సియెర్రా లియోన్), బుహ్లే మామెల్లో డ్లామిని (ఎస్వతిని), కార్ల్ హార్ట్‌మన్ (ఐల్ ఆఫ్ మ్యాన్), లుజున్‌బుల్‌మెన్‌డు (ఇవ్‌మెన్‌బుల్‌మెన్‌లు), (మంగోలియా), ఓడ్ లుట్‌బయార్ (మంగోలియా), న్యాంబాతర్ నారన్‌బాతర్ (మంగోలియా), సెసిల్ అలెగ్జాండర్ (ఫాక్‌లాండ్ దీవులు), జుయాండ్రే షెఫర్ (ఫాక్‌లాండ్ దీవులు), హసన్ నవాజ్ (పాకిస్తాన్) ఈ లిస్టులో ఉన్నారు. కాగా, షాజైబ్ హసన్, ఉమర్ గుల్, మహ్మద్ హఫీజ్, ఫహీమ్ అష్రఫ్, ఉమర్ అక్మల్, నసీమ్ షా, సైమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో రెండు డకౌట్లను కలిగి ఉన్నారు.