Asia Cup 2023: శ్రీలంక vs పాక్ మ్యాచ్.. 45 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. టాస్ గెలిచిన పాక్

ఆసియా కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య కీలక మ్యా్చ్ జరగుతోంది.

Update: 2023-09-14 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య కీలక మ్యాచ్ జరగుతోంది. పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కి కీలకంగా కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ రద్దు ఐతే శ్రీలంక​ఫైనల్‌కు చేరుకుంటుంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా లంక ఈ ఛాన్స్‌ కొట్టేస్తుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్లో శ్రీలంక.. టీమిండియాను ఢీకొంటుంది. మరోవైపు పాక్‌ ఫైనల్‌కు చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఇవాల్టి మ్యాచ్‌ జరిగి, అందులో పాక్‌ విజయం సాధించాలి. పాక్‌కు గెలుపు కాకుండా ఎలాంటి ఫలితం వచ్చినా ప్రయోజనం లేదు. కాగా, మరో సూపర్‌-4 మ్యాచ్‌ జరగాల్సి ఉండగానే భారత్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

సూపర్‌-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్‌, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు భారత్‌ రేపు (సెప్టెంబర్‌ 15) బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాల చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అవకాశం రాని ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్‌ అవకాశం​ కల్పించే ఛాన్స్‌ ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు స్టార్‌ ప్లేయర్లు రెస్ట్‌ తీసుకోవచ్చు.


Similar News