Pakistan vs Bangladesh : ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన పాక్ కెప్టెన్.. అసలేం జరిగిందంటే..?

రావల్పిండి వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

Update: 2024-08-22 00:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రావల్పిండి వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచులో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాస్పదమైంది.వివరాల్లోకెళ్తే..టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు ఆదిలోనే కష్టాలు వచ్చాయి. మూడో ఓవర్లోనే ఓపెనర్ షఫీక్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్‌ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం వేసిన బంతి మసూద్ ప్యాడ్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. దీంతో బంగ్లా కెప్టెన్ రివ్యూ కోరుకున్నాడు.రివ్యూ లో థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించే సరికి షాన్ మసూద్ షాక్ కి గురయ్యాడు.బంతి తన బ్యాట్ కు తగలలేదని తొడ ప్యాడ్‌కు తగిలిందని ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలిందా లేక ప్యాడ్‌కి తగిలిందా అనే దానిపై స్పష్టత రాలేదు. నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినందున, థర్డ్ అంపైర్ నిర్ణయం బ్యాటర్‌కు అనుకూలంగా రావాలి. అయితే, థర్డ్ అంపైర్ షాన్ మసూద్‌ను ఔట్‌గా ప్రకటించాడు.దీంతో అంపైర్ నిర్ణయంపై మసూద్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ లోనే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. అంపైర్ నిర్ణయంపై పాకిస్థాన్ సహాయక సిబ్బంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News