వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్..
వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన 8వ మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది.
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన 8వ మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. అనంతరం 345 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు అవలీలగా ఆడుతూ.. 4 వికెట్ల నష్టానికి 48. 2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. దీంతో వన్డే వరల్డ్ కప్ మొత్తం చరిత్రలో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. కాగా గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ జట్టు కలిగి ఉంది. వారు 2011 ఎడిషన్ లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు.