ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టాప్‌లో పాకిస్థాన్.. మరి భారత్ స్థానం..?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 లో పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలోకి చేరింది. వెస్టిండీస్‌పై 1-0తో సిరీస్ గెలిచిన భారత్ ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో రెండవ స్థానంలో ఉంది.

Update: 2023-07-25 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 లో పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలోకి చేరింది. వెస్టిండీస్‌పై 1-0తో సిరీస్ గెలిచిన భారత్ ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో రెండవ స్థానంలో ఉంది. కాగా భారత్ ఒక విజయం, ఒక డ్రాతో 66.67% పాయింట్లను గెలుచుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ 100% పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే భారత్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్నప్పటికి.. ఒక మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read More : Pawan Kalyan: ఆ జాబితాలో ధోనీ కన్నా ముందున్న పవన్ కల్యాణ్!

Tags:    

Similar News