French Open 2023 Final: ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు.