స్టెఫీ గ్రాఫ్ రికార్డును బద్దలు కొట్టిన సెర్బియా ప్లేయర్..

మాజీ మహిళా టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెర్బియా ఆటగాడు నోవక్ జొకోవిచ్ బద్దలు కొట్టాడు.

Update: 2023-02-27 13:26 GMT

న్యూఢిల్లీ: మాజీ మహిళా టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెర్బియా ఆటగాడు నోవక్ జొకోవిచ్ బద్దలు కొట్టాడు. పురుషులు, మహిళల టెన్నిస్ చరిత్రలో అత్యధిక వారాలు నంబర్ వన్‌గా కొనసాగిన ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన 35 ఏళ్ల జొకోవిచ్ అగ్రస్థానంలో 378 వారాలు కొనసాగాడు. దీంతో 377 వారాలతో స్టెఫీ గ్రాఫ్ పేరుతో ఉన్న రికార్డును జొకోవిచ్ అధిగమించాడు.

‘అత్యధిక వారాలు వరల్డ్ నంబర్ వన్‌గా కొనసాగి పురుషులు, మహిళల టెన్నిస్‌లో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ స్టెఫీ గ్రాఫ్‌తో నన్ను పోల్చడం చాలా ఆనందంగా ఉంది’ అని జొకోవిచ్ అన్నాడు. 2011 జూలైలో తొలిసారి వింబుల్డన్ టైటిల్ అనంతరం జొకోవిచ్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించాడు. 2021 నుంచి పురుషుల ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా కొనసాగిన ఆటగాడిగా కూడా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. గతేడాది నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయిన తర్వాత ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి మళ్లీ టాప్ ర్యాంక్‌ను సాధించాడు. జొకోవిచ్ 10వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచాడు.

Tags:    

Similar News