అతడే అసలైన కూల్ కెప్టెన్ : Sunil Gavaskar

కూల్ కెప్టెన్ అనగానే క్రికెట్ అభిమానులకు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే గుర్తొస్తాడు.

Update: 2023-06-26 14:58 GMT

న్యూఢిల్లీ : కూల్ కెప్టెన్ అనగానే క్రికెట్ అభిమానులకు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే గుర్తొస్తాడు. అయితే, అసలైన కూల్ కెప్టెన్ కపిల్ దేవ్ అని అని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో టీమ్ ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. తొలి ప్రపంచకప్ గెలిచి సరిగ్గా 40 ఏళ్లు అవుతోంది. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సునీల్ గవాస్కర్ తాజా ఇంటర్వ్యూలో అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

‘బ్యాటుతోపాటు బంతితోనూ కపిల్ దేవ్ ప్రదర్శన అబ్బురపరిచింది. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో వివి రిచర్డ్స్ క్యాచ్‌ను అతను అందుకున్నది మర్చిపోకూడదు. ఫార్మాట్‌కు అవసరమయ్యేలా కపిల్ దేవ్ కెప్టెన్సీ డైనమిక్‌గా ఉండేది. ఆటగాళ్లలో ఎవరైనా క్యాచ్‌ను వదిలేసినా లేదా ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా చిరునవ్వుతో ఉండేవాడు. అందుకే అతను ఒరిజినల్ కెప్టెన్ కూల్.’ అని గవాస్కర్ తెలిపాడు. 1983 వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో అనూహ్యంగా ఫైనల్‌కు చేరడంతోపాటు అప్పట్లో బలమైన వెస్టిండీస్‌ను తుది పోరులో ఓడించి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే.


Similar News