వరల్డ్ నం.1 కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

భారత గ్రాండ్‌మాస్టర్, 18 ఏళ్ల ఆర్.ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు.

Update: 2024-05-30 13:59 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత గ్రాండ్‌మాస్టర్, 18 ఏళ్ల ఆర్.ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే)ను మళ్లీ ఓడించాడు. గతంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్‌సన్‌‌ ఆట కట్టించిన అతను.. తాజాగా క్లాసికల్ ఫార్మాట్‌లో తొలిసారి విజయం అందుకున్నాడు. క్లాసికల్ చెస్‌లో కొంతకాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కార్ల్‌సన్‌ను ఓడించడం ప్రజ్ఞానందకు కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. నార్వే చెస్ టోర్నీలో గురువారం జరిగిన మూడో రౌండ్‌లో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. తెల్లపావులతో ఆడిన అతను 37 ఎత్తుల్లో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కార్ల్‌సన్ 3 పాయింట్లతో 5వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు, మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్.వైశాలి కూడా రాణిస్తున్నది. మూడో రౌండ్‌లో ఆమె అన్నా ముజిచుక్(ఉక్రెయిన్)‌తో డ్రా చేసుకుంది. దీంతో వైశాలి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఈ టోర్నీలో తొలి విజయం అందుకుంది. మూడో రౌండ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్జీని 49 ఎత్తుల్లో ఓడించింది. 


Similar News