ఎన్‌సీఏ హెడ్‌గా లక్ష్మణ్ మరో ఏడాది..అతని కాంట్రాక్ట్‌ను పొడిగించిన బీసీసీఐ

నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాదిపాటు కొనసాగనున్నాడు.

Update: 2024-08-15 13:35 GMT

దిశ, స్పోర్ట్స్ : నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాదిపాటు కొనసాగనున్నాడు. అతని కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించింది. 2021లో ఎన్‌సీఏ చీఫ్‌గా రాహుల్ ద్రవిడ్ నుంచి లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. మూడేళ్ల కాంట్రాక్ట్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత లక్ష్మణ్ తిరిగి ఐపీఎల్‌లో కోచ్‌గా ఎంట్రీ ఇస్తాడని, లక్నో సూపర్ జెయింట్స్ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి.

అందుకే, టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపించలేదని ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. యువ క్రికెటర్ల భవిష్యత్తు కోసం లక్ష్మణ్ సేవలను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మరో ఏడాదిపాటు అతని కాంట్రాక్ట్‌ను పొడిగించింది. లక్ష్మణ్ కోచింగ్ స్టాఫ్‌లో షితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిట్కర్‌ ఉన్నారు. వీరు దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజాలుగా గుర్తింపు పొందారు. 

Tags:    

Similar News