దిశ, వెబ్‌డెస్క్: భారత బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇండియా తరఫున వరుసగా రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. 50 కేజీల విభాగంలో ఫైనల్‌లో వియత్నాం బాక్సర్ తమ్ గుయ్‌న్‌పై 5-0 తో విజయం సాధించింది.
గతేడాది కూడా జరీన్ గోల్డ్ మెడల్ సాధించారు. మరోవైపు నిన్న భారత బాక్సర్లు నీతూ, స్వీటీ కూడా గోల్డ్ మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.