ఆఫ్గానిస్తాన్ బౌలర్ అరుదైన రికార్డు..

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ మధ్య జరగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ పేసర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2023-06-14 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ మధ్య జరగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ పేసర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్‌ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్‌ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నీలేష్ కులకర్ణి, చమిలా గమగే, నాథన్ లియోన్, షామిందా ఎరంగా, డేన్ పీడ్ట్, హార్డస్ విల్జోయెన్ ఉన్నారు.


Similar News