ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ దూరం..
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు.
పారిస్: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కారు దొంగిలించిన ఘటనలో అతని పాదాలకు గాయమైంది. కిర్గియోస్ మేనేజర్ డేనియల్ హార్స్ఫాల్ ప్రకారం.. మే 1వ తేదీన కాన్బెర్రాలో జరిగిన దోపిడి సంఘటనలో కిర్గియోస్ తీవ్రంగా గాయపడ్డాడు. కొంత మంది దుండగులు అతని తల్లికి పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి టెస్లా కారును దొంగిలించారు. ‘మే 1వ తేదీని ఆయుధాలు కలిగివున్న కొంత మంది కిర్గియోస్ ఇంట్లోకి చొరబడ్డారు. నిక్ ఎడమ కాలి పాదానికి గాయమైంది. ఎలా జరిగిందో మాకు తెలియదు’ అని హార్స్ఫాల్ చెప్పారు.
అతను తిరిగి కోలుకోవాలంటే మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కిర్గియోస్ చివరిసారి అక్టోబర్‌లో టోక్యో టోర్నీలో ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో అతను మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో ఈ దోపిడీ సంఘటన జరిగి మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేయడానికి అతనికి చాలా కష్టంగా ఉంది. పాదానికి గాయం వల్ల షూ కూడా ధరించలేకపోతున్నాడు.