Neeraj Chopra: మరో సారి అద్భుత ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా .. లుసానె డైమండ్ లీగ్‌లో రెండో స్థానం

భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

Update: 2024-08-22 22:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. గురువారం జరిగిన లుసానె డైమండ్ లీగ్‌లో రెండవ స్థానంలో నిలిచాడు. తన చివరి ప్రయత్నంలో 89.49 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్ లోనే ఉత్తమ ఆట తీరును కనబరిచాడు. కాగా ఇది నీరజ్ యొక్క సీజన్ బెస్ట్ త్రో, మొన్న జరిగిన 2024 పారిస్ ఒలింపిక్స్ లో 89.45 మీటర్ల దూరాన్ని నీరజ్ ఈ లీగ్‌లో క్రాస్ చేశాడు.

తొలి రౌండ్లో జావెలిన్ ను 82.10 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో ఉన్న నీరజ్.. తరువాత వరుసగా 83.21 మీ, 83.13 మీ, 82.34 మీ, 85.58 మీటర్లు విసిరాడు.ఇక చివరి రౌండ్లో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ జావెలిన్ ను 90.61 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలవగా తరువాత నీరజ్ తన ఫైనల్ రౌండ్లో 89.49 మీటర్లు విసిరి రెండో స్థానాన్నిఆక్రమించాడు . జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచాడు.

Tags:    

Similar News