ఈ స్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. రెజ్లర్లకు పెరుగుతోన్న మద్దతు

తమకు న్యాయం చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు పలువురు క్రీడా ప్రముకులు బాసటగా నిలుస్తున్నారు.

Update: 2023-04-28 08:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమకు న్యాయం చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు పలువురు క్రీడా ప్రముకులు బాసటగా నిలుస్తున్నారు. ఈ అంశంపై ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా, వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతాకం విజేత నిఖత్ జరీన్, ఒలింపిక్స్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా రియాక్ట్ అయ్యారు. నీరజ్ చోప్రా ట్వీట్ చేస్తూ న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యను చాలా పారదర్శకంగా పరిష్కరించాలని కోరారు. దీక్షలో భాగంగా వీధుల్లో నిద్రిస్తున్న రెజ్లర్ల ఫోటోను నిఖత్ జరీన్ షేర్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో మన ఒలింపిక్, ప్రపంచ పతక విజేతలను చూసి నా హృదయం బద్దలవుతోందన్నారు.

క్రీడాకారులు పేరు, పురస్కారాలు తీసుకురావడం ద్వారా దేశానికి సేవ చేస్తారని రెజ్లర్ల దీక్ష విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వీలైనంత త్వరగా న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రెజ్లర్ల దీక్ష క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటే పీటీ ఉష ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడుతున్నారు. పీటీ ఉష వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Tags:    

Similar News