Asian Games: చైనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి..

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్‌లో ఓటమిపాలైంది.

Update: 2023-10-05 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్‌లో ఓటమిపాలైంది. ఆతిథ్య చైనా జట్టు 4-0 గోల్స్‌ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆసియా గేమ్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. చివరిసారిగా 2018లో జకార్తా ఆసియా క్రీడల్లో టైటిల్‌ మ్యాచ్‌లో జపాన్‌పై ఓటమిపాలైంది. 1982 నుంచి భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని సాధించలేకపోయింది. ఇక భారత జట్టు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కోసం పోటీపడనున్నది. ఈ నెల 7న జపాన్‌ లేదంటే దక్షిణ కొరియాతో తలపడనున్నది. మహిళల హాకీలో చైనాపై భారత్‌కు ఇది పదో ఓటమి. ఇరుదేశాల మధ్య 23 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం చైనాపై ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది.

ఆసియా గేమ్స్‌లో మహిళల జట్టు తొలిమ్యాచ్‌లో సింగపూర్‌ను 13-0 గోల్స్‌తో ఓడించింది. ఆ తర్వాత మలేషియాపై 6-0తో గెలుపొందింది. దక్షిణ కొరియాతో జరిగిన మూడో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగింది. హాంకాంగ్‌పై 13-0తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓమిటి లేకుండా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. సెమీఫైనల్‌లో చైనాతో మ్యాచ్‌లో మాత్రం తడబడింది.


Similar News