ఆఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ సంచలన నిర్ణయం..

Update: 2023-09-27 16:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌ సంచలన నిర్ణయం ప్రకటించాడు. 2023 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్‌.. 2021లో తన చివరి వన్డే ఆడాడు.

కెరీర్‌లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్‌.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. నవీన్‌ తన వన్డే కెరీర్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ 2023లో కోహ్లితో గొడవతో నవీన్‌ ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు.

Similar News