బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ అరుదైన రికార్డు.. రెండో క్రికెటర్‌గా..

బంగ్లాదేశ్‌ స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హొసెన్‌ షాంటో అరుదైన రికార్డు సాధించాడు.

Update: 2023-06-16 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హొసెన్‌ షాంటో అరుదైన రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్‌ తరఫున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ ఘనతను సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్‌ చేరుకున్నాడు.

గతంలో మోమినుల్‌ హక్‌ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. టెస్టుల్లో అఫ్గానిస్తాన్‌ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఓవరాల్‌ టెస్టు క్రికెట్‌ జాబితాలో నజ్ముల్‌ హొసెన్‌ షాంటో 91వ క్రికెటర్‌గా నిలిచాడు.


Similar News