బజరంగ్ పునియాకు షాక్.. డోప్ శాంపిల్ ఇవ్వనందుకు సస్పెండ్

టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పునియా నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ (నాడా) షాక్ ఇచ్చింది.

Update: 2024-05-05 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పునియా నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ (నాడా) షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో సోనిపట్‌లో జరిగిన ట్రయల్స్‌లో డోప్ శాంపిల్ ఇవ్వనందుకు అతన్ని NADA తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సోనిపట్‌లో జరిగిన ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై ఓడిపోయిన తర్వాత బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించారు. ఎలిమినేట్ అయిన తర్వాత పునియా ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ నుండి నిష్క్రమించాడు. నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ (నాడా) అధికారులు పునియా నుండి డోప్ పరీక్ష కోసం నమూనా సేకరించడానికి ప్రయత్నించారు. రూల్స్ అతిక్రమించినందుకు గాను పూనియాపై ఒలింపిక్స్ కోసం రాబోయే ట్రయల్స్‌లో కూడా పాల్గొనకుండా నిరోధించబడవచ్చని అధికారులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Similar News