అందుకే నా సక్సెన్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నా : అశ్విన్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదో టెస్టుతో టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడబోతున్నాడు
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదో టెస్టుతో టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడబోతున్నాడు. ఈ స్పెషల్ మ్యాచ్‌కు ముందు జియో సినిమాలో అనిల్ కుంబ్లేతో అశ్విన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అశ్విన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 100వ టెస్టు తన వ్యక్తిగత విజయమే కాదని, కుటుంబ విజయమని చెప్పాడు. ‘100వ టెస్టు నాకు చాలా ముఖ్యమైనదే. కానీ, నా కుటుంబానికి అంత కంటే ఎక్కువ. ఆ టెస్టు కోసం నా పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. ఆటగాడి ప్రయాణంలో కుటుంబం పాత్ర పెద్దది. క్రికెట్‌లో తన కొడుకు ఏం చేశాడో అనే దానిపై నా తండ్రి ఇప్పటికీ 40 కాల్స్‌కు సమాధానమిచ్చాడు.’ అని అశ్విన్ తెలిపాడు.
క్రికెట్ అనేది స్వీయ విమర్శనాత్మక ఆట అని, మీపై మీరు కఠినంగా ఉంటే నిజం బయటకు వస్తుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అందుకే, తాను విజయాన్ని ఆస్వాదించలేనని తెలిపాడు. ‘నా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. కానీ, అదే నేను మంచి క్రికెటర్‌గా మారడానికి దోహదపడింది. నిరంతరం మెరుగుపడటానికి చూస్తాను. ఏదైనా రోజున ‘నేను ఎవరు’ అనే దానిపై అసౌకర్యంగా ఉంటే నేను ఇంకా ఏం చేయగలను అనే దానిపై దృష్టి పెడతాను.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనే అశ్విన్ 500 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. 99 టెస్టు మ్యాచ్‌ల్లో అశ్విన్ 507 వికెట్లు తీశాడు.