IPL 2025 : ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా హప్కిన్‌సన్

ఐపీఎల్-2025 సీజన్‌కు తమ ఫీల్డింగ్ కోచ్‌గా కార్ల్ హప్కిన్‌సన్‌ను నియమిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ శుక్రవారం ప్రకటించింది.

Update: 2024-12-13 12:31 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 సీజన్‌కు తమ ఫీల్డింగ్ కోచ్‌గా కార్ల్ హప్కిన్‌సన్‌ను నియమిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ శుక్రవారం ప్రకటించింది. హప్కిన్‌సన్ 2019 వన్డే వరల్డ్ కప్, 2022 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు ఏడేళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. హప్కిన్‌సన్ ఫీల్డింగ్‌ వ్యూహాలతో ఇంగ్లాండ్ అండర్-19 జట్టు 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మార్క్ బౌచర్‌ స్థానంలో మహేల జయవర్ధనేను ప్రధాన కోచ్‌గా నియమించింది. బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేని అపాయింట్ చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఏకంగా పదో స్థానానికి పడిపోయిన ముంబై జట్టు ఈ సారి ఎలాగైనా టోర్నీలో సత్తా చాటాలని కీలక ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది.

Tags:    

Similar News