‘ఈస్ట్ ఆర్ వెస్ట్.. సూర్యకుమార్ ఈజ్ బెస్ట్’

గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Update: 2023-05-27 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా వరుసగా రెండో ఏడాది టైటిల్‌ పోరులో నిలిచింది. అయితే, వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(60 బంతుల్లో 129, 7ఫోర్లు, 10 సిక్స్‌లు) దూకుడైన ఆటతీరుతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 233/3 భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులు చేసింది. సూర్యకుమార్య్రాదవ్‌(38 బంతుల్లో 61, 7ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ(14 బంతుల్లో 43, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. డూ ఆర్ డై మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సూర్య మరోసారి రాణించాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. చివర్లో అనూహ్యంగా ఔటయ్యాడు. అయినా.. చివరి వరకూ పోరాడిన సూర్యను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతున్నారు. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్.. సూర్యకుమార్ ఈజ్ బెస్ట్’ అంటూ కామెంట్లతో భరోసా కల్పిస్తున్నారు.

Tags:    

Similar News