ఐపీఎల్ 2025 లో MS ధోని జీతంలో భారీగా కోత.. ఎందుకంటే..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడి ఐపీఎల్ లోనే అత్యధిక కప్పులకు సాధించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడి ఐపీఎల్ లోనే అత్యధిక కప్పులకు సాధించారు. కేవలం ధోని చెన్నై జట్టులో ఉండటం కారణంగా ఆ జట్టుకు మొత్తం పది ఐపీఎల్ జట్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే చెన్నై మాజీ కెప్టెన్ MS ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినందున అతను ఇప్పుడు 'అన్‌క్యాప్డ్' ఆటగాడిగా మిగిలిపోయాడు. దీంతో ఐపీఎల్ లో 2024 వరకు ఆయన చెన్నై జట్టుతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. జీతం అందగా.. ప్రస్తుతం ఆ జీతంలో దాదాపు రూ. 7 కోట్ల వరకు కోత ఉండవచ్చని తెలుస్తోంది.
ఐపిఎల్ 2022 మెగా వేలానికి ముందు ప్రవేశపెట్టిన ప్రస్తుత బిసిసిఐ నిబంధనల ప్రకారం.. ఫ్రాంచైజీలు రూ.4 కోట్లకు ‘అన్‌క్యాప్డ్’ ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించారు. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం భారత క్రికెట్ బోర్డు ఈ మార్కును గరిష్టంగా రూ. 5 కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో రూ. 12 కోట్లను జీతంగా అందుకున్న ధోని ఈ సీజన్ నుంచి అన్ క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఉండటంతో అతని జీతంలో ఈ 7 కోట్ల కోత ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే.. ముందుకు ధోని ఐపీఎల్ లో కొనసాగుతున్నారా లేదా తెలియాలి. అలాగే బీసీసీఐ విధించే కొత్త నిబంధనలపై క్లారిటీ రావాల్సి ఉంది.