దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2023 సీజన్‌తో తన కెరీర్‌కు ముగింపు ఇవ్వాలని అనుకుంటున్న టీమ్ ఇండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సీఎస్‌కేను మరోసారి విజేతగా నిలపాలని ఆశిస్తున్నాడు. తొలిసారి చెన్నైలో సొంత అభిమానుల సమక్షంలో ధోనీ బరిలోకి దిగబోతున్నాడు. ఇందుకోసం చెపాక్ స్టేడియంలో నెల నుంచే ధోనీ, సీఎస్‌కే క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి ట్రెయినింగ్‌లో పాల్గొంటున్న ధోనీ సహచరులతో సరదాగా కూడా గడిపాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ.. కనిపించాడు.
చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించగా.. చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనుండంతో స్టాండ్స్‌లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్‌కే తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఐపీఎల్ ఈనెల 31న ప్రారంభమవనుంది. సీఎస్కే జట్టు ఈ సీజన్‌లో తమ సొంతనగరంలో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 3న లక్నోతో తలపడనుంది.
“𝑫𝒆𝒇𝒊𝒏𝒊𝒕𝒆𝒍𝒚 𝒍𝒐𝒐𝒌𝒊𝒏𝒈 𝒀𝒆𝒍𝒍𝒐𝒗𝒆”
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
Anbuden Awaiting for April 3🦁💛 pic.twitter.com/eKp2IzGHfm