ఫెరారీ రేసింగ్ కార్లు దాదాపు రెడ్ కలర్‌లోనే ఎందుకుంటాయి..?! ఇదీ కారణం
దాదాపు 85% ఫెరారీలు ఎరుపు రంగు రంగులోనే ఉండేవి. Most of the Ferrari Super cars are in Red Color.
దిశ, వెబ్‌డెస్క్ః ఫెరారీ అనే పేరు వినగానే ఎఫ్1 రేసు, కళ్లకు కూడా అందని సూపర్ స్పీడ్ కారు గుర్తుకొస్తాయి. అయితే, ఊహల్లో వచ్చే ఆ కారు కూడా ఎరుపు రంగులోనే కనపడటం విశేషం. ఇక, మారనెల్లో హౌస్‌లో చాలా మోడల్‌లు ఐకానిక్ ఎరుపు రంగులోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా? ఈ ఇటాలియన్ కార్ తయారీదారులు చేసే సూపర్ కార్లలో ఫెరారీ 166 MM బార్చెట్టా నుండి ఫెరారీ 296 GTS వరకు దాదాపు అన్ని అత్యంత ప్రసిద్ధ మోడళ్లు రెడ్ రంగులోనే ఉంటాయి. అయితే, కాలక్రమేణా, రోసో బార్చెట్టా, రోస్సో బెర్లినెట్టా, రోస్సో కోర్సా, రోస్సో ఫియోరానో వంటి అనేక ఇతర ఎరుపు రంగు షేడ్స్ ఉన్నా, అవన్నీ రెడ్ షేడ్‌నే పులుముకున్నాయి.
అయితే, దాదాపు ఫెరారీలన్నీ ఎందుకు ఎరుపు రంగులో ఉంటాయన్నది చాలా మందిలో ఉండే సందేహం. 1990ల ప్రారంభంలో, దాదాపు 85% ఫెరారీలు ఎరుపు రంగు రంగులోనే ఉండేవి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది రోసో కోర్సా. ఇదే ఫైనల్ ఫెరారీ రంగు అనుకుంటారు. రోస్సా కోర్సా రంగు చాలా తరచుగా ఉపయోగించడం వెనుక కేవలం సౌందర్య కారణాలే కాదు, ఫెరారీతో ఎరుపు రంగుకున్న అనుబంధం ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నాటిది. అప్పట్లో రేసు కార్ల ర్యాలీల్లో ప్రతి జట్టు తమ వాహనాన్ని వారి జాతీయ రంగులో ఉంచాలనే నియమాలు పాటించేవి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆకుపచ్చ కార్లు, ఫ్రాన్స్‌లో బ్లూ, ఇటలీలో రెడ్ కలర్ కార్లు ఉండేవి. ఇక, ఇటాలియన్ జెండాలో ఎరుపు రంగు కూడా ఉండటం, ఫెరారీ ఇటాలియన్ సంస్థ అవడం వల్ల వారి రేస్ కార్ల బాడీపై ఎరుపు రంగును ఉపయోగించాల్సి వచ్చింది. ఇక, ఎంజో ఫెరారీ, కంపెనీ యజమానికి రేసింగ్ అంటే చాలా ఇష్టం. దానికి తోడు ఫెరారీ జట్టుకు ఎరుపు రంగు వాడటం, వారు రేసింగ్‌లో బ్రాండ్ రెడ్ టీమ్‌గా మారడంతో రెడ్ వారి సిగ్నెచర్‌గా మారింది. అయితే, ఇప్పుడు ఫెరారీ తమ కస్టమర్లకు కస్టమ్ రంగులు ఇస్తున్నా.. ఫెరారీ అంటే రెడ్‌గానే స్థిరపడింది.