Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన షమీ.. ఎట్టకేలకు వీడిన సస్పెన్స్..!

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో

Update: 2024-07-20 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారంపై ఇప్పటికే సానియా మీర్జా తండ్రి స్పందించి.. అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. షమీ, సానియా పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. తాజాగా సానియాతో మ్యారేజ్ రూమర్స్‌పై మహ్మద్ షమీ రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ ఈ ఇష్యూపై స్పందించారు.

తాను, సానియా పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ట్రోలర్స్‌ను హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు వార్తలు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేయాలనుకునే వారు ముందు అది నిజమో కాదో నిర్ధారించుకున్నా తర్వాత పోస్ట్ చేయాలని సూచించారు.

కాగా, షమీ వ్యక్తిగత కారణాలతో గత కొంత కాలంగా ఆయన భార్యకు దూరంగా ఉంటుండగా.. సానియా ఈ ఏడాది తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు డివోర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను బేస్ చేసుకుని షమీ, సానియా మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై షమీ క్లారిటీ ఇవ్వడంతో ఎట్టకేలకు సానియాతో పెళ్లి రూమర్స్‌కు ఎండ్ కార్డు పడింది. ఇక, వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండలానికి గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన షమీ.. ఇప్పుడు మళ్లీ కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బెంగుళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 


Similar News