పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా వ్యాఖ్యలకు మహ్మద్ షమీ కౌంటర్

Update: 2023-11-08 16:19 GMT

న్యూఢిల్లీ : వన్డే వరల్డ్ కప్‌లో భారత్ చీటింగ్ చేస్తుందని అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజాకు టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది గల్లీ క్రికెట్ కాదని, ఐసీసీ టోర్నీ అని ఫైర్ అయ్యాడు. ఇటీవల పాక్ మీడియాతో హసన్ రాజా మాట్లాడుతూ ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులిస్తున్నారని, డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా భారత్‌కే అనుకూలంగా వస్తున్నాయని వ్యాఖ్యానించాడు. హసన్ రాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా షమీ స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘అర్థం లేని వ్యాఖ్యలు. సిగ్గు పడండి. ముందు ఆటపై దృష్టి పెట్టండి.

ఇతరుల విజయాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. ఇది పాక్‌లో జరిగే గల్లీ టోర్నమెంట్ అనుకున్నావా?. ఐసీసీ వరల్డ్ కప్. మీ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ చెప్పేదైనా విను. మీ ఆటగాడినైనా నమ్మండి. మిమ్మల్ని మీరు పొగుడుకునే పనిలో బిజీగా ఉన్నారు’ అంటూ షమీ పోస్టు చేశాడు. షమీ పోస్టు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హసన్ రాజాకు గట్టి కౌంటర్ ఇచ్చావంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Similar News