Michael Vaughan: టెస్ట్ మధ్యలో ఐపీఎల్ మెగా వేలమా.. బీసీసీఐపై మైకేల్ వాన్ ఫైర్
ఐపీఎల్ మెగా వేలం (IPL Mega Auction) కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మెగా వేలం (IPL Mega Auction) కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఫ్రాంచైజీలు ఎలాంటి ఆటగాళ్లను ఆక్షన్‌లో సొంతం చేసుకుంటారోనని చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా ఆక్షన్ (IPL Mega Action)పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డర్-గవస్కర్ (Border-Gavaskar) సరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. అయితే, 24న ఐపీల్ (IPL) మెగా ఆక్షన్ నిర్వహించడం పట్ల మైకేల్ వాన్ (Michael Vaughan) తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్ మధ్యలో వేలం ఏంటని బీసీసీఐ (BCCI)పై మండిపడ్డాడు. మొదటి, రెండో టెస్ట్ మధ్యలో తొమ్మిది రోజుల టైం ఉందని ఆ సమయంలో వేలం నిర్వహిస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. టెస్ట్ మధ్యలో వేలం జరిగితే ప్లేయర్లు తమ ఏకాగ్రతను కోల్పోతారని, మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని మైకేల్ వాన్ అన్నాడు.