మరో టైటిల్‌కు అడుగు దూరంలో బోపన్న జోడీ

భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఈ సీజన్‌లో మరో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు.

Update: 2024-03-29 12:53 GMT

దిశ, స్పోర్ట్స్ : 44 ఏళ్ల వయసులో అదరగొడుతున్న భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఈ సీజన్‌లో మరో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన అతను.. మియామి ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో మెన్స్ డబుల్స్‌లో అతను ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి శుక్రవారం ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

సెమీస్‌లో బోపన్న జోడీ 6-1, 6-4 తేడాతోగ్రానోల్లెర్స్(స్పెయిన్)-జెబాలోస్(అర్జెంటీనా) జంటను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరుస సెట్లలో ప్రత్యర్థిని నిలువరించిన బోపన్న జోడీ 53 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. మియామి ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోవడం బోపన్నకు ఇదే తొలిసారి. లియాండర్ పేస్ తర్వాత మొత్తం 9 ఏటీపీ ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా బోపన్న నిలిచాడు. శనివారం టైటిల్ పోరులో 2వ సీడ్ ఇవాన్ డోడిగ్(క్రోయేషియా)-ఆస్టిన్ క్రాజిసెక్(అమెరికా) జంటతో బోపన్న జోడీ తలపడనుంది. 

Tags:    

Similar News