రోహిత్‌ను అందుకే తప్పించారు.. రీజన్ రివీల్ చేసిన ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడానికి గల కారణాన్ని ఫ్రాంచైజీ హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్ రివీల్ చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మను తప్పించడానికి గల కారణాన్ని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్ రివీల్ చేశాడు. అది పూర్తిగా క్రికెట్ నిర్ణయమని చెప్పాడు. ‘పాండ్యాను ప్లేయర్‌గా తీసుకరావడానికి చూశాం. నాకు తెలిసి ఇది పరివర్తన దశ. భారత్‌లో చాలా మందికి ఇది అర్థం కాదు. అభిమానులు ఎమోషనల్‌గా ఉంటారు. భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ఇది నేను క్రికెట్ నిర్ణయంగా భావిస్తున్నా. ఈ నిర్ణయం ద్వారా రోహిత్‌ను వ్యక్తిగా, ఆటగాడిగా అత్యుత్తమంగా చూస్తామనుకుంటున్నా. అతన్ని పరుగులు చేయనివ్వండి. మేము అతన్ని నవ్వు ముఖంతో ఆడటం చూడాలనుకుంటున్నాం.’ అని బ్రౌచర్ చెప్పుకొచ్చాడు. కాగా, రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు, పాండ్యా చీలమండలం గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న అతను ఐపీఎల్ నాటికి అందుబాటులోకి వచ్చే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.