థాయిలాండ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్‌లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో గురువారం సాత్విక్ జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ జంట 21-16, 21-11 తేడాతో చైనాకు చెందిన క్సీ హావో నాన్-జెంగ్ వీ హాన్ జంటను చిత్తు చేసింది. దూకుడుగా ఆడిన భారత ఆటగాళ్లు 38 నిమిషాల్లోనే ప్రత్యర్థులకు ఓటమి రుచిచూపించారు. నేడు క్వార్టర్ ఫైనల్లో జనైద్ ఆరిఫ్-రాయ్ కింగ్ యాప్(మలేషియా)తో సాత్విక్ జంట తలపడనుంది.
మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జంట కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో భారత అమ్మాయిలు 21-19, 21-17 తేడాతో లిన్ యు పెయ్-హంగ్ ఎన్ ట్జు(చైనీస్ తైపీ) జోడీని ఓడించారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో మీరబా మైస్నం సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి రౌండ్లో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు షాకిచ్చిన ఈ యువ ఆటగాడు రెండో రౌండ్లో సత్తాచాటాడు. 50 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మీరబా 21-14, 22-20 తేడాతో మ్యాడ్స్ క్రిస్టోఫర్సెన్(డెన్మార్క్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నేడు క్వార్టర్స్‌లో 4వ సీడ్ విటిదర్న్(థాయిలాండ్)ను ఎదుర్కోనున్నాడు. ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో అష్మిత చాలిహా 15-21, 21-12, 12-21 తేడాతో హన్ యూ(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అలాగే, మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్-ఆద్య జోడీ నిరాశపరిచాయి.