మూడు నెలల విశ్రాంతి తీసుకోనున్న మను బాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-13 13:54 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమె మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, కొన్ని రోజులపాటు మను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తుందట. ఈ విషయాన్ని ఆమె కోచ్ జస్పాల్ రాణా తెలిపారు. అక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌ ఫైనల్‌కు ఆమె దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

జాతీయ మీడియాతో కోచ్ జస్పాల్ రాణా మాట్లాడుతూ..‘మను మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటుంది. ఇది సాధారణ విరామమే. ఆమె చాలా రోజులుగా శిక్షణ పొందుతుంది. కాబట్టి, షూటింగ్ వరల్డ్ కప్‌లో ఆమె పాల్గొంటుందో లేదో కచ్చితంగా చెప్పలేను.’ అని తెలిపారు. కాగా, అక్టోబర్ 13 నుంచి 18 వరకు ఢిల్లీలో వరల్డ్ కప్ జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్రెనెడా వరల్డ్ కప్ ఈవెంట్‌లో మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.

Tags:    

Similar News