క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన Manoj Tiwary
భారత మాజీ ప్లేయర్ బెంగాల్ సారథి మనోజ్ తివారీ అన్ని క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రటించాడు. తివారీ 2008, 2015 మధ్య భారత్ తరఫున 12 ODIలు 3 T20I లలో ఆడాడు. ఇందులో వన్డేలో ఓ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్లేయర్ బెంగాల్ సారథి మనోజ్ తివారీ అన్ని క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రటించాడు. తివారీ 2008, 2015 మధ్య భారత్ తరఫున 12 ODIలు 3 T20I లలో ఆడాడు. ఇందులో వన్డేలో ఓ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో వివిధ జట్లు తరుఫున ఆడిన ఆయన 2012 ఎడిషన్‌లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ట్రోఫీని గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. దీంతో అతను తన రాష్ట్రం కోసం 141 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 169 లిస్ట్ A, 183 T20 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ క్రికెట్‌లో ఒక లెజెండరీ ప్లేయర్ గా నిలిచాడు.
తివారీ తన FC కెరీర్‌ను 48.56 సగటుతో 29 సెంచరీలు , 45 అర్ధ సెంచరీలతో 10000 పరుగులకు 92 పరుగుల దూరంలో ముగించాడు. అలాగే 2023 రంజీ ట్రోఫీలో బెంగాల్ కెప్టెన్‌గా వ్యవహరించి తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 37 ఏళ్ల అతను తన రిటైర్మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. కాగా మనోజ్ తివారి ప్రస్తుతం పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వంతో యూత్ ఎఫైర్స్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.